క్రీడా స్ఫూర్తితో రాణించాలి

ABN , First Publish Date - 2023-09-26T00:08:47+05:30 IST

విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో వ్యవహ రించి సత్తాచూపాలని డీఈవో కె.వెంకటేశ్వరరావు అన్నారు.

క్రీడా స్ఫూర్తితో రాణించాలి

- డీఈవో వెంకటేశ్వరరావు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, సెప్టెంబరు 25: విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో వ్యవహ రించి సత్తాచూపాలని డీఈవో కె.వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్‌ జిల్లాస్థాయి ఎంపికల ప్రారం భోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టెక్కలి డిప్యూటీ డీఈవో పగడాలమ్మ మాట్లాడుతూ.. వ్యాయామ ఉపాధ్యాయులు మంచి క్రీడాకారులను తయారు చేసి జిల్లా పేరు తెచ్చేలా కృషి చేయాలన్నారు. కాగా డీఈవో కూతకు వెళ్లి ఈ పోటీలను ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శ బీవీ రమణ, పీఈటీ, పీడీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, జిల్లా ఒలింపిక్‌ సంఘం సలహాదారుడు పి.సుందరరావు, జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పీఈటీ సంఘ ప్రతినిథులు తవిటయ్య, సాధు శ్రీనివాసరావు, ఎస్‌.సూరిబాబు, కె.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:08:47+05:30 IST