భద్రమ్మతల్లి గుడిపై పిడుగు
ABN , First Publish Date - 2023-03-20T00:05:30+05:30 IST
శ్రీకాకుళం నగరం బలగలోని భద్రమ్మ తల్లి గుడిపై ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పిడుగు పడింది. దీంతో ఆలయ గోపురంపై ఉన్న కొన్ని విగ్రహాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.

- పాక్షికంగా దెబ్బతిన్న ఆలయ గోపురంపైన ఉన్న విగ్రహాలు
అరసవల్లి, మార్చి 19: శ్రీకాకుళం నగరం బలగలోని భద్రమ్మ తల్లి గుడిపై ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పిడుగు పడింది. దీంతో ఆలయ గోపురంపై ఉన్న కొన్ని విగ్రహాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. గర్భగుడిలోని సీలింగ్ పెచ్చులు ఊడి పడడంతో అమ్మవారి విగ్రహంపై ఉన్న వెండి గొడుగు, వెండి కలశం దెబ్బతిన్నాయి. అయితే, తరతరాలుగా పూజిస్తు న్న అమ్మవారి మట్టి విగ్రహానికి ఎటువంటి నష్టం జరగకపోవడంతో అమ్మవారి మహిమగా భక్తులు చెప్పుకుంటున్నారు. అదే పిడుగు బయటపడి ఉంటే ఎంతో ప్రాణనష్టం సంభవించేదని, అమ్మవారే మమ్మల్ని ఈ ఆపద నుంచి కాపాడిందని కీర్తిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రీకాకుళం నియోజ కవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి భద్రమ్మ ఆలయాన్ని సంద ర్శించారు. పిడుగుపాటు నుంచి ప్రజలను కాపాడిన భద్రమ్మతల్లి పాదాలకు నమస్కరించారు. ఆమె వెంట పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ఇతర నాయకులు ఉన్నారు.