Share News

పెళ్లయిన మూడు నెలలకే..

ABN , First Publish Date - 2023-12-04T00:20:02+05:30 IST

పెళ్లయిన మూడు నెలలకే ఓ నవ వధువు మృతి చెందిన ఘటన పలాస-కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

పెళ్లయిన మూడు నెలలకే..

- అనారోగ్యంతో నవవధువు మృతి

పలాస: పెళ్లయిన మూడు నెలలకే ఓ నవ వధువు మృతి చెందిన ఘటన పలాస-కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ రోడ్డులో నివాసముం టున్న జ్యూయలరీ వ్యాపారి తాళాసు శ్రీనివాసరావుకు పలాస కు చెందిన రేషన్‌ డీలరు తంగుడు వినోద్‌ కుమార్తె స్పందన (28)తో ఈ ఏడాది ఆగస్టు 30న వివాహం జరిగింది. ఈ జంట 15 రోజుల క్రితం హనీమూన్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చింది. అయితే, స్పందనకు గ్యాస్‌ట్రిక్‌ సమస్య తలెత్తడంతో వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో సమీపంలో ఉన్న ఏఎన్‌ఎం వచ్చి పరిశీలించింది. తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆమె సూచించింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. గ్యాస్‌ట్రిక్‌తో పాటు గుండెకు సంబంధించిన నొప్పులు రావడంతో ఆమె మృతి చెందినట్లు భర్త, ఆమె తండ్రి వినోద్‌ తెలిపారు. పెళ్లయిన మూడు నెలలకే స్పందన మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి మృతి

పలాసరూరల్‌: పలాస మండలం కైజోల గ్రామంలో ఆదివారం వరి నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు నుర్పుడి యంత్రంలోకి పడి తాళ పోలయ్య(60) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో పొలంలో ఉన్న తోటి రైతులు అతన్ని హుటా హుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెంది నట్టు గుర్తించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-04T00:20:03+05:30 IST