ఇదే జగనన్న గోరు ‘ముద్ద’
ABN , First Publish Date - 2023-10-26T23:47:25+05:30 IST
పాఠశాలల్లో విద్యార్థు లకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తు న్నామని ప్రభుత్వం చేసే ప్రకటనలు క్షేత్ర స్థాయిలో కానరావడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎన్టీఆర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో అమలు చేసిన జగనన్న గోరు ముద్ద తీరు.. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థు లకు గురువారం మధ్యాహ్న భోజనంలో ముద్దయిన అన్నంలో సాంబారు వేసి, గుడ్డు, చాలీచాలని పచ్చడి వేసి అందించారు.
టెక్కలి రూరల్: పాఠశాలల్లో విద్యార్థు లకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తు న్నామని ప్రభుత్వం చేసే ప్రకటనలు క్షేత్ర స్థాయిలో కానరావడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎన్టీఆర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో అమలు చేసిన జగనన్న గోరు ముద్ద తీరు.. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థు లకు గురువారం మధ్యాహ్న భోజనంలో ముద్దయిన అన్నంలో సాంబారు వేసి, గుడ్డు, చాలీచాలని పచ్చడి వేసి అందించారు. దీంతో విద్యార్థులు దీనిని తినలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడ డంతో నాణ్యత లేని భోజనాలు వంట నిర్వాహకులు పెడుతున్నారని విమర్శలు వినిపిస్తు న్నాయి. ఈ విషయమై ఎంఈవో డి.చిన్నారావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా పాఠశాలను సందర్శించి జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుం టామన్నారు.