‘అమృత్ భారత్’లో మూడు స్టేషన్లు
ABN , First Publish Date - 2023-08-05T23:37:53+05:30 IST
కేంద్రప్రభుత్వం ప్రకటించిన అమత్ భారత్’ పథకంలో జిల్లాలోని మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం రోడ్, పలాస, నౌపడ రైల్వే స్టేషన్లలో వివిధ పనులు చేపట్ట నున్నారు. ఈ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించనుండగా జిల్లాలో జరుగు కార్యక్రమా ల్లో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అప్పలరాజు తదితరులు శ్రీకారం చుట్ట నున్నారు.
శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి)/పలాస/టెక్కలి: కేంద్రప్రభుత్వం ప్రకటించిన అమత్ భారత్’ పథకంలో జిల్లాలోని మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం రోడ్, పలాస, నౌపడ రైల్వే స్టేషన్లలో వివిధ పనులు చేపట్ట నున్నారు. ఈ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించనుండగా జిల్లాలో జరుగు కార్యక్రమా ల్లో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అప్పలరాజు తదితరులు శ్రీకారం చుట్ట నున్నారు. పలాస, నౌపడా, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట నున్నారు. పలాస స్టేషన్‌ను రూ.23.85 కోట్లతో ఆధునికీకరణతో పాటు ఒక ప్లాట్ ఫారం నిర్మా ణం, రోడ్లు, స్టేషన్‌లో మౌలిక వసతులను కల్పించనున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, మూడు ఫ్లాట్ ఫారాలు కలుపుతూ కొత్త బ్రిడ్జిల నిర్మాణం, విశ్రాంత మందిరాలు, విద్యుద్దీకరణ పనులు చేపట్టను న్నారు. డివిజన్‌లో ఆదాయపరంగా పలాస మొదటి స్థానంలో ఉండగా ప్రతిరోజు ఐదువేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రూ.24 కోట్లతో శ్రీకాకుళం రోడ్, రూ.17 కోట్ల వ్యయంతో నౌపడ రైల్వే స్టేషన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కేంద్రానికి కృతజ్ఞతలు
జిల్లాలో పలాస, శ్రీకాకుళం రోడ్, నౌపడ రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌లో చేర్చడం ఆనంద దాయకం. ఈ స్టేషన్ల ఆధునికీకరణకు నిర్ణయిం చిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కృతజ్ఞతలు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి వల్ల జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
-కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ