Share News

యువగళం శంఖారావం విజయవంతం చేయాలి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:55 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించ నున్న శంఖారావం కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

యువగళం శంఖారావం విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పక్కన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించ నున్న శంఖారావం కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలోని పార్టీ నాయ కులు, కార్యర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కూడా మంజూరు చేయలేదని.. అందువల్ల ఇతర వాహనాల్లో జనాలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పది వేల మంది వరకు హాజరుకావాలని.. ఈ బాధ్య తను నాయకులు తీసు కోవాలని చెప్పారు. శంఖారావం మాదిరిగా భోగా పురంలో జరగనున్న భారీ సభకు నాయకులు హాజరై.. ఉత్తరాంధ్ర ప్రజలు మద్ద్ధతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, సింతు సుధాకర్‌, చిట్టి నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:55 PM