‘నారాయణపురం’ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-04-08T23:56:09+05:30 IST

నారాయణపురం కుడి కాలువ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను ఎచ్చెర్ల మండల రైతులు కోరారు. ఈ మేరకు శనివారం చీపురుపల్లిలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఆయన్ను కలిసి వినతిపత్రం అందించారు. నారాయణపురం కుడి కాలువ ద్వారా శివారుల భూములకు నీరందడం లేదని, జైకా నిధులతో చేపడుతున్న కాలువ పనులను వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిచేసి సాగునీటిని అందించాలని కోరారు. ధర్మవరంలోని మునియాం చెరువు, బగ్గువానిచెరువు, దాలబంద, కునుకువాని, గొలగబంద చెరువుల మదుములను ఎంపీ ల్యాడ్‌తో బాగుచేయాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో మండల వ్యవసాయ సలహా బోర్డు సభ్యుడు అల్లు సూర్యనారాయణ, అరసవల్లి రామారావు ఉన్నారు.

‘నారాయణపురం’ పనులు వేగవంతం చేయాలి

ఎచ్చెర్ల: నారాయణపురం కుడి కాలువ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను ఎచ్చెర్ల మండల రైతులు కోరారు. ఈ మేరకు శనివారం చీపురుపల్లిలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఆయన్ను కలిసి వినతిపత్రం అందించారు. నారాయణపురం కుడి కాలువ ద్వారా శివారుల భూములకు నీరందడం లేదని, జైకా నిధులతో చేపడుతున్న కాలువ పనులను వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తిచేసి సాగునీటిని అందించాలని కోరారు. ధర్మవరంలోని మునియాం చెరువు, బగ్గువానిచెరువు, దాలబంద, కునుకువాని, గొలగబంద చెరువుల మదుములను ఎంపీ ల్యాడ్‌తో బాగుచేయాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో మండల వ్యవసాయ సలహా బోర్డు సభ్యుడు అల్లు సూర్యనారాయణ, అరసవల్లి రామారావు ఉన్నారు.

Updated Date - 2023-04-08T23:56:09+05:30 IST