టీడీపీ జెండా దిమ్మ ధ్వంసం

ABN , First Publish Date - 2023-08-18T00:17:57+05:30 IST

పలాస కాశీబుగ్గ ము న్సిపాలిటీ పరిధిలోని అంతరకుడ్డ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి టీడీపీ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులు దీనిపై స్పందిస్తూ.. ఈ నెల 20న గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగనుందన్నారు.

టీడీపీ జెండా దిమ్మ ధ్వంసం
దిమ్మను పునర్నిర్మించి టీడీపీ జెండాను ఎగుర వేస్తున్న నాయకులు

పలాస/కాశీబుగ్గ, ఆగస్టు 17: పలాస కాశీబుగ్గ ము న్సిపాలిటీ పరిధిలోని అంతరకుడ్డ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి టీడీపీ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులు దీనిపై స్పందిస్తూ.. ఈ నెల 20న గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగనుందన్నారు. గ్రామంలో చాలా ఏళ్లుగా టీడీపీ జెండా దిమ్మ ఉందన్నారు. గురువారం ఉదయం టీడీపీ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే విషయం బయట పడింది. దీంతో ఒక్కసారిగా స్థానిక టీడీపీ నాయకులు దిమ్మ వద్దకు చేరుకున్నారు. విషయాన్ని మాజీ మంత్రి గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీతో పాటు ఇతర టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ధ్వంసం చేసిన చోటనే జెండా దిమ్మను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని ఆరోపించారు. ఇటీవల మందస మండలం బాలిగాంలో ఇదే పరిస్థితి చోటు చేసుకుందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆదివారం అంతరకుడ్డలో ‘గడప గడపకు.. కార్యక్రమం నిర్వహించనున్నారని... అందులో భాగంగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ జెండా, దిమ్మను ధ్వంసం చేసి ఉంటారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దిమ్మ పునర్నిర్మాణంలో టీడీపీ నాయ కులు జి.వైకుంఠరావు, ఎ.సురేష్‌, బి.శంకర్‌, ఎస్‌.శంకర్‌, ఎ.వెంకటరమణ, బి.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-18T00:17:57+05:30 IST