Share News

సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Dec 29 , 2023 | 11:57 PM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్ర వారం నాలుగోరోజు గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ... సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.

సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
ఇచ్ఛాపురం: భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు

కాశీబుగ్గ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్ర వారం నాలుగోరోజు గాంధీ విగ్రహం వద్ద సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ... సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణపతి, సీపీఐ నియోజకవర్గ నాయకుడు చాపర వేణుగోపాల్‌, పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు మురుగన్‌, రవి, దివాకర్‌, శంకర్‌, సీతమ్మ, ముఖి, లక్ష్మి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో భిక్షాటనతో నిరసన
ఇచ్ఛాపురం:
పారిశుధ్య, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ కార్మికులు సమస్యలు పరిష్కారం కోరుతూ వినూత్నంగా ప్లేట్లు పట్టు కొని భిక్షాటన చేశారు. శుక్రవారం శిబిరంలో కూర్చొని ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా సమస్యలు పరి ష్కరించేంతవరకు ఆందోళన చేస్తామని ఏపీ మున్సిపల్‌ వర్క ర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ పట్నా యక్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
ఆమదాలవలస:
పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం ఆమదాలవలస అధ్య క్షుడు సంతోష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులు శుక్రవారం డప్పుల వాయిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబే డ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి వినతిపత్రం అందించారు.

Updated Date - Dec 29 , 2023 | 11:57 PM