వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-08-02T00:02:22+05:30 IST
వీవోఏలకు హెచ్‌ఆర్ ఫాలసీని అమలుచేసి సమస్యలను పరిష్కరించా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు.
ఎచ్చెర్ల: వీవోఏలకు హెచ్‌ఆర్ ఫాలసీని అమలుచేసి సమస్యలను పరిష్కరించా లని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. ఎచ్చెర్లలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైకేపీలో పనిచేస్తున్న వీవోఏలు చాలా ఏళ్లుగా కనీస వేతనాలతో పనిచేస్తున్నారన్నారు. కాలపరిమితి నిబంధనను అమల్లోకి తీసుకువచ్చి తొలగింపులకు పాల్పడడం సరికాదన్నారు. తెలం గాణ మాదిరిగా సీబీవో హెచ్‌ఆర్ ఫాలసీని అమలుచేసి, ఉద్యోగ భద్రత కల్పించా లన్నారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘ మండల శాఖ ప్రతినిధులు జి.అరుణ, కె.సరిత, బి.కనకమహాలక్ష్మి, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.