1,61,628
ABN , First Publish Date - 2023-12-11T00:25:50+05:30 IST
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రక్రియ శనివారంతో ముగిసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల కమిషన్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా.. ఫారం- 6, ఫారం - 7, ఫారం - 8కు సంబంధించి 1,61,628 వినతులు వచ్చాయి.
- ఇదీ ముసాయిదా ఓటర్ల జాబితాపై వినతుల సంఖ్య
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రక్రియ శనివారంతో ముగిసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల కమిషన్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా.. ఫారం- 6, ఫారం - 7, ఫారం - 8కు సంబంధించి 1,61,628 వినతులు వచ్చాయి. ఓటర్ల నమోదులు.. చేర్పులు.. మార్పులు... సవరణలు.. తొలగింపు ఇలా అన్నింటికీ ఇంచుమించు సమానంగానే దరఖాస్తులు అందాయి. ముందునుంచీ ప్రతిపక్షం చెబుతున్నట్లుగానే తొలగింపు ఓట్లు, డబుల్ ఓట్లు అధికంగానే ఉన్నాయని.. వీటిపై చర్యలు తీసుకోవాలని.. ప్రత్యేకడ్రైవ్‌లో దరఖాస్తులను అందజేశారు. జనవరిలో పూర్తిస్థాయి ఓటర్ల జాబితా విడుదల కానుంది.
స్పెషల్‌డ్రైవ్‌లో స్వీకరించిన దరఖాస్తులు..
=========================================
నియోజకవర్గం ఫారం-6 ఫారం-7 ఫారం-8
=========================================
ఇచ్ఛాపురం 8276 4932 2850
పలాస 8936 6366 5396
టెక్కలి 6064 5361 4736
పాతపట్టణం 6374 12328 14222
శ్రీకాకుళం 8869 5968 4991
ఆమదాలవలస 4810 2934 4025
ఎచ్చెర్ల 7923 11008 10993
నరసన్నపేట 6356 3822 4088
=======================================
మొత్తం 57608 52719 51301