పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించాలి
ABN , First Publish Date - 2023-09-26T00:12:28+05:30 IST
పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించాలని, అవసరమైతే ప్రోత్సహించాలని సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్ అన్నారు.

- సబ్ కలెక్టర్ నూరుల్ కమర్
టెక్కలి, సెప్టెంబరు 25: పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించాలని, అవసరమైతే ప్రోత్సహించాలని సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక చెత్త నుంచి సంపద సేకరణ కేంద్రంలో గ్రీన్ అంబాసి డర్లతో ‘కాఫీ విత్ క్లాప్‌మిత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికు లకు ప్రోత్సాహంగా, ప్రేరణగా ఉండాలని సూచించారు. ఐదు నెలలుగా వేతనాలు లేవని పారిశుధ్య కార్మికులు ఆయనదృష్టికి తీసుకువెళ్లగా పంచాయతీ కార్యదర్శి కొత్తగా విధుల్లో చేరినందున బిల్లులు చెల్లిం పునకు సీఎఫ్‌ఎంఎస్ సమస్య జరిగిందని, త్వరలో వేతనాలు చెల్లించడం జరుగుతుందని డీఎల్‌పీవో రమణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణమూర్తి, సెక్రటరీ మల్లేశ్వరరావు, కాంతారావు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన సబ్‌కలెక్టర్
సబ్ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూరుల్ కమార్ సోమవారం కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలెక్టరేట్‌లో కలిశారు. మూలపేట పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ పనులు వేగవంతం అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.
సంతబొమ్మాళిలో..
సంతబొమ్మాళి: కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమాన్ని సంతబొమ్మాళి గ్రామ చెత్త సేకరణ కేంద్రం వద్ద సోమవారం నిర్వహించారు. టెక్కలి డీఎల్పీవో ఐవీ రమణ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులకు ప్రేరణ కలిగేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వారి ద్వారానే గ్రామాల్లో పారిశుధ్యం మెరుగవుతుం దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమలీల, ఈవోపీఆర్డీ గోపాలరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.