గాయపడిన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-03-02T00:03:21+05:30 IST
పాలవలసపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తి బుధవారం మృతిచెందినట్టు పోలీ సులు తెలిపారు. గత నెల 27న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు గాయపడిన విషయం విదితమే.
నందిగాం: పాలవలసపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తి బుధవారం మృతిచెందినట్టు పోలీ సులు తెలిపారు. గత నెల 27న ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు గాయపడిన విషయం విదితమే. ఈ ప్ర మాదంలో తీవ్రంగా గాయపడిన కొండతెంబూరు గ్రామానికి చెందిన నాయుడుగారి కేశవరావు(45) రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈయనకు భార్య హైమావతి, ఇద్దరు కు మారులు, వివాహిత అయిన కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ మహ్మద్ అమీర్ ఆలీ తెలిపారు.