ఆమదాలవలసలో ఆకతాయల హల్‌చల్‌

ABN , First Publish Date - 2023-06-03T00:33:20+05:30 IST

పట్టణ పరిధిలో ఆకతాయల అల్లరి రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో సామన్యులు ఇబ్బందిపడుతున్నారు.

ఆమదాలవలసలో ఆకతాయల హల్‌చల్‌
సాయినగర్‌లో ఓ ఇంటి ముందున్న బైక్‌ సీట్‌ కోసేసిన ఆకతాయలు

- వరుస ఘటనలు.. ఆందోళనలో పట్టణ ప్రజలు

- దృష్టి సారించని పోలీసులు

ఆమదాలవలస: పట్టణ పరిధిలో ఆకతాయల అల్లరి రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో సామన్యులు ఇబ్బందిపడుతున్నారు. కొంతమంది, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు లోనై అల్లర్లకు పాల్పడు తున్నారు. ఇటీవల ఓ రోజు రాత్రి ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన ఓ వ్యక్తి శ్రీకాకుళం వెళ్లే క్రమంలో కొంతమంది యువకులు అడ్డగించారు. బెదిరించి, కొట్టి అతడి నుంచి ఫోన్‌, నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. వారిని రెండు రోజుల కిందట కోర్టులో హాజరు పరిచారు. అయినా ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన మరువక ముందే తాజాగా పట్టణంలో సాయినగర్‌ పెంటయ్య క్వార్టర్స్‌, దాలినాయడు క్వార్టర్స్‌, ఎల్‌ఐసీ కార్యాలయం ప్రాంతాల్లో ఇళ్ల ముందు ఉంచిన ద్విచక్ర వాహనాల సీట్లు కోసి, పెట్రోల్‌ దొంగిలించుకుపోయిన ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ఇలా దాదాపు 25 బైక్‌ల సీట్లు కోసి, పెట్రోల్‌ దొంగిలించుకుపోయారు.

కళాశాల మైదానంలో..

చీకటి పడితే చాలు ఆమదాలవలస ప్రభుత్వ కళాశాల మైదానాన్ని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒక చోటా నాయకుడు పెళ్లి రోజు వేడుకలు, పుట్టిన రోజు వేడుకలు అంటూ మందు పార్టీలు మైదానంలో చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గంజాయి కూడా విక్ర యిస్తుండడంతో ఆ మత్తులో వారు ఏమి చేస్తున్నారో తెలియడం లేదని కొంతమంది చెబుతున్నారు. తెలుస్తుంది. పోలీసుల మెతక వైఖరితోనే కొంత మంది ఇలా రెచ్చిపోతున్నారని పట్టణవాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాత్రి గస్తీ పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా బైక్‌ సీట్లు కోసి వేయడం, పెంట్రోల్‌ విషయమై ఎస్‌ఐ కృష్ణ వద్ద ప్రస్తావించగా.. ఘటన జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఎవరూ ఫిర్యాదు చేయలేద న్నారు. అయినా సిబ్బందిని పంపించి ఘటనకు గల కారణలను తెలుసుకుంటామన్నారు. ఆకతాయల ఆగడాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-03T00:33:20+05:30 IST