టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్‌

ABN , First Publish Date - 2023-08-22T00:01:21+05:30 IST

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం జిల్లాలోని పలుచోట్ల భవిష్యత్‌కు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమాలు నిర్వహించారు.

టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్‌
బూర్జ: మాట్లాడుతున్న కూన రవికుమార్‌

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం జిల్లాలోని పలుచోట్ల భవిష్యత్‌కు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమాలు నిర్వహించారు.

చంద్రబాబును సీఎం చేయాలి: రవికుమార్‌

బూర్జ: రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని టీడీఆర్‌రాజుపేటలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌కు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చే యాల్సి ఉందన్నారు.అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాదరావు, ప్రభా కరరావు, లంక జగన్నాథంనాయుడు, గోపిమాస్టర్‌, గోవిందరావు, గణపతిరావు పాల్గొన్నారు.

వైసీపీ పాలన అవినీతిమయం

లావేరు: వైసీపీ పాలన అవినీతిమయమయ్యిందని, అరాచకం రాజ్యమే లుతోందని తెలుగు మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత సురేష్‌ ఆరోపించారు. సోమవారం మండలంలోని పెదకొత్తకోటలో టీడీపీ మహాశక్తి కార్యక్రమంపై చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా తొలుత ర్యాలీచేశారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరాచాకాలను ప్రశ్నించే వారిపైన దాడులు, మహిళలు పట్ల అఘాయిత్యాలు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గంటా సంధ్యగజపతి, నాయ కులు మేడబోయిన శ్రీరామూర్తి, రొక్కం సాంబమూర్తి, కిల్లాన శ్రీను, కె.త్రినా ఽథరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:01:21+05:30 IST