Share News

బాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

ABN , First Publish Date - 2023-11-10T00:42:13+05:30 IST

రాష్ట్ర భవిష్యత్‌ చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు.

బాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు
జి.సిగడాం: ఆనందపురంలో ప్రచారం చేస్తున్న కళావెంకటరావు

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు

జి.సిగడాం, నవంబరు 9: రాష్ట్ర భవిష్యత్‌ చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం ఆనందపురం, దవళపేట గ్రామాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షే మ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం మహాశక్తి వంటి కార్యక్రమాలు ద్వారా ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధితో పాటు రైతులకు, అన్నిరంగాలవారికి పలు పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈయన వెంట నాయకులు కుమరాపు రవికుమార్‌, టంకాల మౌళీశ్వరరావు, కంచరాన సూరన్నాయుడు, చిత్తిరి అసిరినాయుడు, పొగిరి పాపారావు, సిత్తిరి లక్ష్ముం, కూనుబిల్లి కూర్మారావు, పైల రామకృష్ణం నాయుడు, నక్క మురళి, ఆరేళ్ల గొల్లాజీ, కోన వెంకటరావు, మహాదాశ్యం చిన్నా రావు, బాలబొమ్మ చిన్నబాబు, యండమూరి శ్రీనివాసరావు, విక్రం కాశీబాబు, విక్రం సత్యారావు, పొగిరి అప్పారావు, గుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: బగ్గు

నరసన్నపేట: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం మండలంలోని మాకివలసలో బాబుతో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పార్టీ మండలాధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్‌ అధ్యక్షతన నిర్వ హించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శిమ్మ పార్వతి, యాళ్ల వేణుగోపాల రావు, కింజరాపు సూర్యనారాయణ, పీస కృష్ణ ,శిమ్మ జగన్నాథం పాల్గొన్నారు.

- కోటబొమ్మాళి: ఊడికలపాడులో మాజీ సర్పంచ్‌ గొండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో కోటబొమ్మాళి వైశ్యలవీధి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. హరిశ్చంద్రపురం, తిలారు, సరియాపల్లి, బావాజీపేట, కురుడు, పెద్ద బమ్మిడి తదితర గ్రామాల్లో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, హనుమంతు అప్పల రాజు, కోరాడ గోవిందరాజు, ఎస్‌.రామ్‌కుమార్‌, దేవాది సింహాద్రి పాల్గొన్నారు.

- సంతబొమ్మాళి: రాష్ట్రంలో రానున్నది చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వమని పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న తెలిపారు. గురువారం యమాలపేటలో భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు కర్రి విష్ణుమూర్తి, సూరాడ ధనరాజ్‌, బాలరాజు, సువ్వారి ప్రసాద్‌, ఎంపల్లి జోగారావు పాల్గొన్నారు.

- నందిగాం: నరేంద్రపురం పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ బోకర సన్యాసిరావు, మాజీ సర్పంచ్‌ జీర మోహనరావు, పీఏసీఎస్‌ మాజీ డైరెక్టర్‌ కవిటి ధర్మారావు ఆ ధ్వర్యంలో నరేంద్రపురం, నారాయణపురం, పాలవలసల్లో కరపత్రాలు అందిం చారు. టీడీపీ నాయకులు పి.అజయ్‌కుమార్‌, పి.చంద్రశేఖర్‌, ఎం.బాలకృష్ణ మా ట్లాడుతూ భవిష్యత్‌కు గ్యారెంటీ చంద్రబాబుతోనే సాధ్యమని, ఆరు వినూత్న కార్యక్రమాలు ఆసరాగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో బి.గిరిబాబు, ఎన్‌.నాగరాజు, ఎం.సింహాచలం, కె.ప్రసాదరావు, జె.షన్ముఖరావు పాల్గొన్నారు.

- జలుమూరు (సారవకోట): చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రజానీకానికి భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని టీడీపీ మండల నాయకులు సురవరపు తిరుపతిరావు తెలిపారు. సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు పంచాయతీ సవరబొంతులో ఇన్‌చార్జి సొల్లంగి సురేష్‌ ఆధ్వర్యంలో ఇంటింటా తిరిగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. యూనిట్‌ ఇన్‌చార్జి కోన వెంకటేష్‌, పిళ్లా నందకిషోర్‌ పాల్గొన్నారు.

- కొత్తూరు: బమ్మిడిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను వివరించారు. అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపాలని కోరారు.

శ్రీకూర్మంలో..

గార: శ్రీకూర్మంలో గురువారం సాయంత్రం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కైబాడి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొని మాట్లాడుతూ.. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టో గురించి అవగాహన కల్పించారు. జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి గోర సురేష్‌, టీడీపీ నాయకులు కోరాడ వెంకట అప్పారావు, జల్లు రాజీవ్‌, పి.కృష్ణమూర్తి, మళ్ల నర్సింగరావు, రమణ పాల్గొన్నారు.

యువతను మోసగించిన వైసీపీ

ఎచ్చెర్ల: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైసీపీ మోసం చేసిందని టీడీపీ నేతలు గాలి వెంకటరెడ్డి, బచ్చు కోటిరెడ్డి, గూరు జగపతిబాబు, బోర శ్రీనివాస రావు, పైడి ముఖలింగం, అల్లుపల్లి రాంబాబు ఆరోపించారు. ఎచ్చెర్లలోని నియోజకవర్గ కార్యాలయ ఆవరణలో తెలుగు యువత ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని వైసీపీ తీరుకు నిరసనగా గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ల కార్డులతో సీఎంకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మెండ రాజారావు, పొన్నాడ సన్యాసిరావు, మూకళ్ల భాస్కరరావు, గాడు రామారావు పాల్గొన్నారు.

- పొందూరు: మండల కేంద్రం పొందూరులో గురువారం బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్రానికి బాబు అవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు రామ్మోహన్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఎ.రాము, తెలుగుయువత జిల్లా ప్రధానకార్యదర్శి శంకరభాస్కర్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎ.చినరంగ, ఎంపీటీసీ ఎ.వాణి, బాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

విజన్‌ ఉన్న నాయకుడు.. చంద్రబాబు

- కవిటి: ఆంధ్ర రాష్ట్రంలో విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబుతోనే భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. గురువారం జగతి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి పాలనలో యువకులతో పాటు రాష్ట్రానికి భవిష్యత్‌ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి దిశ, దశ చూపేనేత చంద్రబాబు అని అన్నారు. అలాంటి నేతను అక్రమంగా అరెస్ట్‌చేసి హింసించారని అన్నారు. కార్యక్రమంలో పి.కృష్ణారావు, రమేష్‌, బీమ్‌రావు రౌళో, బాసుదేవ్‌రౌళో, మణిచంద్రప్రకాష్‌, సంతోష్‌పట్నాయక్‌, చిన్నబాబు పాల్గొన్నారు.

నిరంకుశ విధానాలతోనే రాజకీయ సంక్షోభం

పాతపట్నం: జగనరెడ్డి నిరంకుశ పాలనా విధానాలతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకటరమణ మూర్తి ఆరోపించారు. మండలంలోని తీమర, తామర గ్రామాల్లో బాబు ష్యూరి టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ సెల్‌ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు పైల లక్ష్మయ్య, టీడీపీ నాయకులు బండి రవివర్మ, పడాల తిరుపతి రావు, లండ తాతబాబు, జనసేన పార్టీ నాయకులు మిత్తన ప్రసాదరావు, కణితి తారకేశ్వరరావు, జనార్దనరావు, సైలాడ సతీష్‌ పాల్గొన్నారు.

- బూర్జ: నీలాపురం, మదనాపురం గ్రామాల్లో గురువారం ‘బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి భవిష్యత్తులో టీడీపీ అధకారంలోకి వచ్చిన తర్వాత అందించనున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసిరెడ్డి వెంకునాయుడు, దుర్గారావు, మజ్జి అప్పలాయుడు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:42:35+05:30 IST