రెయ్యిపాడులో ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-06-11T23:45:20+05:30 IST
రెయ్యిపాడు గ్రామ దేవత ఉత్సవాలు ఆదివారం ప్రారంభ మయ్యాయి. ఇందులో భాగంగా గాంధమ్మ కు పూజలు చేశారు. మహిళలు ఘటాలతో ఉరేగింపుగా వెళ్లి గారమ్మతల్లి కి మొక్కులు చెల్లించుకున్నారు.
వజ్రపుకొత్తూరు: రెయ్యిపాడు గ్రామ దేవత ఉత్సవాలు ఆదివారం ప్రారంభ మయ్యాయి. ఇందులో భాగంగా గాంధమ్మ కు పూజలు చేశారు. మహిళలు ఘటాలతో ఉరేగింపుగా వెళ్లి గారమ్మతల్లి కి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ ధర్మారావు ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్య, మాజీ సర్పంచ్ సైని భాస్కరరావు, మద్దిల హరినారాయణ, తిరుపతి, గ్రామ, ఉత్సవ కమిటీల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మద్దిలివాని పేటలో...
నందిగాం: పెద్దతామరాపల్లి పంచాయతీ మద్దిలివాని పేటలో కిల్లి పోలమ్మతల్లి గ్రామదేవత ఉత్స వాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి దేవరను మేళ తాళాలు, పగటివేషాలతో ఊరేగింపుగా వచ్చి ముర్రాటలతో చల్లదనం చేశారు. వల్లభరాయుడుపాడు పంచాయతీ మణిగాంలో పాతపట్నం అమ్మతల్లి, పాల పోలమ్మ తల్లి గ్రామదేవతల ఆలయాల ప్రథమ వార్షికోత్సవం ఆదివారం జరిగింది. గ్రామస్థుల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవార్లను దర్శించుకుని ముర్రాటలతో చల్లదనం చేశారు.
ఉత్సవ విగ్రహాలకు క్షీరాభిషేకం
పూడివానిపేట(పోలాకి): పూడివానిపేటలో రామాలయాల ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాల్లో భాగంగా ఆదివారం విగ్రహాలకు ధాన్య, జల, క్షీరా, శయ్యాధి వాసాలు నిర్వహించారు. వేద పండితులు శృంగారం ధనుంజయశర్మ నేతృత్వంలో రుత్వికులు హోమాలు, అభిషేకాలు చేయించారు. సోమవారం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పండి తులు శర్మ తెలిపారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.