ఓటమి భయంతోనే కులాల మధ్య చిచ్చు
ABN , First Publish Date - 2023-06-26T23:32:53+05:30 IST
ఓటమి తప్పదనే భయంతో రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, నాయ కులు కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికు మార్ ఆరోపించారు.
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
పొందూరు: ఓటమి తప్పదనే భయంతో రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, నాయ కులు కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికు మార్ ఆరోపించారు. సోమవారం మండలంలోని కితంలి, తాడివలస, తాణేం, బి.కంచరాం, దళ్లవలస తోలాపి తదితర గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బి. కంచరాంలో విలేక రులతో మాట్లాడుతూ పదవికోసం ఎంతటికి దిగజార డానికైనా సిద్ధమయ్యే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రంలో కులాలమధ్య కుంపట్లు పెడుతున్నారని ఆరో పించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా స్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదని, ప్రతిపక్షాలను అంతం చేసైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారని విమ ర్శించారు. అధికారం కోసం, అప్పులు చేసి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిందని ఆరోపించారు. తిరిగి రాష్ట్ర ఆర్థికప రిస్థితిని గాడిలో పెట్ట గల నాయకుడు చంద్ర బాబేనన్నారు. కులాల మధ్య కుంపట్లలో భాగంగా కాపుల మధ్య చిచ్చు రేపడానికి ముద్రగడను పావులా వాడుకుటుంన్నారని విమర్శించా రు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజిర్వేషన్ అంటూ ఉద్యమాలు చేసిన ముద్రగడ వైసీపీ ప్రభుత్వం కాపులకు ఏమి రిజిర్వేషన్ ఇచ్చిందని మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాపులను ముఖ్యంగా చిరంజీవిని, పవన్‌ను తిట్టిన ద్వారంపూడి వంటివారిని వెనుకేసుకురావడంతో ఆంతర్యమే మిటని ప్రశ్నించారు. ఈబీసీ కోటాలో కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజిర్వేషన్‌పై జగన్‌ను ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు. ముద్రగడకు కాపుల ప్రయోజనా లకన్నా వైసీపీ ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వి.మురళి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్, తోలాపి మాజీ సర్పంచ్ రామారావు, శ్రీనివాసరావు, కింతలి ఎంపీటీసీ హనుమంతురావు, మాజీ సర్పంచ్, గణపతి పాల్గొన్నారు.
తోలాపిలో కార్యకర్తల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న రవికుమార్