భయం గొల్పిన పోర్టు వాహనం
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:08 AM
తెంబూరు రోడ్డులో ఆదివారం సాయంత్రం మూలపేట పోర్టు వాహనం వెను టైర్ ఊడిపోయి కొంతదూరం వెళ్లి ఆగిఉన్న కారుకు తగలడంతో దెబ్బతింది.
- కంటైనర్ టైరు ఊడి దెబ్బతిన్న కారు
- త్రుటిలో తప్పిన ప్రమాదం
టెక్కలి రూరల్: తెంబూరు రోడ్డులో ఆదివారం సాయంత్రం మూలపేట పోర్టు వాహనం వెను టైర్ ఊడిపోయి కొంతదూరం వెళ్లి ఆగిఉన్న కారుకు తగలడంతో దెబ్బతింది. అయితే పోర్టుకు సంబంధిం చిన భారీ కంటైనర్ టైరు ఊడి పోయి అతివేగంగా వచ్చిన సమయంలో అటుగా స్థాని కులు, ద్విచక్ర వాహన దారులు, పాదచారులు లేకపోవడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింద ని స్థానికులు తెలిపారు. ఇటీవల డీఎస్పీ డి.బాలచం ద్రారెడ్డి పోర్టు ట్రాన్స్‌పోర్టు వాహ నదారులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించినా ఫలితం కనిపిం చడం లేదన్న వాదనలొస్తున్నాయి. అతివేగంగా దూసుకు వచ్చిన లారీ కంటైనర్ టైరు ఎవరికైనా తగిలి ఉంటే ప్రాణాల మీదకు వచ్చి ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైన నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతున్న పోర్టు వాహనాల ఫిట్‌నెస్‌పై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరు తున్నారు. దీనిపై ఎస్‌ఐ ఎల్.రామకృష్ణను వివరణ కోరగా ఈ ఘటనపై ఎటువంటి సమాచారం లేదని, పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.