రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2023-05-26T00:09:30+05:30 IST

వైసీపీ రాక్షస పాలన అంతానికి సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు.

రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయి
విలేకరులతో మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం, మే 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాక్షస పాలన అంతానికి సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. గురువారం సాయంత్రం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు, మహానాడు కార్యక్రమాలు రాజమహేంద్రవరంలో పార్టీ ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. సుమారు 17 లక్షల మందికి పైగా టీడీపీ కార్యకర్త లు, ప్రజలు హాజరవుతున్నారని.. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అయితే మహానా డుకు, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు ఎవరిని వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని... కనీ సం కోరినట్లుగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడంలేదన్నారు. ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యా న్ని కూడా బెదిరిస్తూ.. వారిని కూడా నిలువరిస్తుం డడం దారుణమన్నారు. ప్రజల మదిలో చెరగని ముద్రగా ఎన్టీఆర్‌ స్థిరపడిపోయారని.. తెలుగు ప్రజ లెన్నటికీ ఎన్టీఆర్‌ను మరచిపోరని చెప్పారు. ప్ర భుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ తల పెట్టిన కార్యక్రమాలు నిలిచిపోవని చెప్పారు. జిల్లా నుంచి శతజయంతి వేడుకలకు, మహానాడుకు వెల్లువగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నాలుగేళ్ల నుంచి వైసీపీ రాక్షస పాలన వల్ల ప్రజలు విసిగివేసారిపోయారని చెప్పారు. ప్రభుత్వం పాల్ప డుతున్న దుర్మార్గమైన చర్యలను ప్రజలు గమని స్తున్నారని తెలిపారు. ఆర్టీసీ బస్సులను బుక్‌ చేసు కోవడం వల్ల ఆర్టీసీ సంస్థకే ఆదాయం లభిస్తుందని.. కానీ దురుద్దేశ్యంతో బస్సులను కూడా కేటాయించ కుండా ప్రతి విషయంలో కక్షసాధింపుతోనే ప్రభుత్వం వ్యవహరిస్తుండడం మంచిదికాదన్నారు. జగన్‌రెడ్డి నియంత పాలనకు రానున్న ఎన్నికలతో ముగింపు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, టీడీపీ అను బంధ విభాగ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సింతు సుధాకర్‌, పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, టీడీపీ డివిజన్‌ ఇన్‌ఛార్జి విబూది సూరిబాబు, ప్రధాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.

మహానాడు పోస్టర్ల ఆవిష్కరణ

పాతపట్నం: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ప్రతీఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొనేందు కుగానూ పిలుపునిస్తూ వాహనాలపై అంటించే పో స్టర్లను గురువారం ఆవిష్కరించారు. మహానాడు కార్యక్ర మంలో భాగంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవవేడుకలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రతీఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.్చ

Updated Date - 2023-05-26T00:09:30+05:30 IST