టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
ABN , First Publish Date - 2023-12-11T00:20:57+05:30 IST
రాష్ట్రానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అ న్నారు.
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి: రాష్ట్రానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అ న్నారు. ఆదివారం బెజ్జిపురం గ్రామంలో జరిగిన బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అన్ని విధాలా దోపిడీ చేస్తుందే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. పంచాయతీల్లో కనీసం మౌలిక వసతులు కల్పించుకునేందుకైనా సర్పంచ్‌ల కు నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి సైకో జగన్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్. పార్టీ రాష్ట్ర కన్వీనర్ బోయిన గోవిందరాజులు, పార్టీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్, తర్రారామకృష్ణ,వెలమల విజయలక్ష్మి, నంబాళ్ల శ్రీనివాసరావు, కర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.