ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2023-09-22T23:40:41+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని, ప్లాం ట్‌ను కాపాడుకునేందుకు పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కోరారు. శుక్రవారం ఉక్కు పరిరక్షణ బైక్ ర్యాలీ శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల గుండా సాగింది.
అరసవల్లి/ నరసన్నపేట/కాశీబుగ్గ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని, ప్లాం ట్‌ను కాపాడుకునేందుకు పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కోరారు. శుక్రవారం ఉక్కు పరిరక్షణ బైక్ ర్యాలీ శుక్రవారం జిల్లాలో పలు ప్రాంతాల గుండా సాగింది. శ్రీకా కుళం, నరస్నపేట, కాశీబుగ్గల్లో వారు మాట్లాడుతూ.. రాష్ట్రా నికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ఇప్పు డు స్టీల్‌ప్లాంట్ అమ్మకం ద్వారా ఉత్తరాంధ్రకు ఉరితాడు బిగిస్తోందని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ అభివృద్ది చెందాలని అప్పటిలో దివంగత నేత సర్దార్ గౌతు లచ్చన్న తన పదవికి రాజీనామా చేశారన్నారు. ఉక్కు పరిశ్రమ ద్వారా లక్ష మంది ఉపాధి పొందుతున్నారని, అభివృద్ధి చేస్తే మరో 25వేల మంది కి ఉపాధి లభిస్తుందన్నారు. అయితే స్టీల్ ప్లాంట్‌కు ముడి సరుకు రానివ్వకుండా అడ్డుకుంటూ నష్టాల పేరుతో మూసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులను తిప్పి కొట్టాల న్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర భవిష్యత్తా?, లేక అదానీ భవిష్యత్తా? అనేది తేల్చుకోవాలని కోరారు. దీనిపై ప్రజా చైతన్యానికి 34 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ నియోజక వర్గాల్లో బైక్‌ర్యాలీ చేపడుతున్న తెలిపారు. ఈనెల 29న జరిగే బహిరంగసభకు అన్ని వర్గాల వారు, రాజకీయాలకు అతీతం గా హాజరై స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో మహిళాసంఘ నాయకులు నాగమణి, ఆర్.స్వప్న, రైతు సంఘ నాయకులు కరగాన కొండయ్య, జోగి గన్నయ్య, కాళ్ల నర్సింహులు, తర్ల లక్ష్మణరావు, తమిరి తిరు పతిరావు, సిర్ల ప్రసాద్, రట్టి ప్రకాశ్, మోహన్ రావు, శ్రీనివాస్, గోవింద రావు, అజయ్ కుమార్, గణపతి తదితరులు పాల్గొన్నారు.
నందిగాం: సీపీఎం ఆధ్వర్యంలో ఉక్కు రక్ష ణ బైక్‌ర్యాలీ శుక్రవారం నందిగాం చేరింది. విశాఖపట్నం నుంచి ఆరు రోజుల పాటు చేపడుతున్న ఈ యాత్ర నందిగాం చేరింది. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు, ఆంఽద్రుల హక్కు అంటూ నినదించారు. కార్యక్రమంలో ఎల్లయ్య, షణ్ము ఖరావు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.