గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN , First Publish Date - 2023-05-31T23:48:31+05:30 IST

జిల్లాలో వివిధ గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వైశాఖ మాసం సందర్భంగా ఆల యాల ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠలు, అమ్మవారి సంబరాలు, కల్యాణ మహో త్సవా లతో బుధవారం గ్రామాల్లో ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

 గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
గార: లక్ష్మీనృసింహ స్వామి తిరువీధి సందర్భంగా చిన్నారుల కోలాట ప్రదర్శన

(ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లాలో వివిధ గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వైశాఖ మాసం సందర్భంగా ఆల యాల ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠలు, అమ్మవారి సంబరాలు, కల్యాణ మహో త్సవా లతో బుధవారం గ్రామాల్లో ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల ఉత్సవాల్లో భాగంగా ముర్రాటలతో చల్లదనం, ఊరేగింపులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వేషధారణలు, కోలాట నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాత పట్నం అమ్మవారి ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో భక్తులతో రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిటలాడాయి.

Updated Date - 2023-05-31T23:48:31+05:30 IST