Share News

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2023-11-04T23:51:35+05:30 IST

ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్‌డ్రైవ్‌ను శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- జాబితాలు ప్రతీ ఒక్కరూ పరిశీలించుకోవాలి

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

కలెక్టరేట్‌, నవంబరు 4 : ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్‌డ్రైవ్‌ను శనివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ల తొలగింపు, చేర్పులు వంటి అభ్యంతరాల నమోదును పరిశీలించారు. మహిళలు, పురుషుల ఓటర్ల మధ్య వ్యత్యాసంపై ఆరా తీశారు. ఫారం 6, 7, 8 ద్వారా వాటిని సరిచేసుకునే అవకాశంపై బూత్‌ లెవెల్‌ అధికారులకు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తామని, అదే నెల 26లోగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి సీహెచ్‌ రంగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, శ్రీకాకుళం తహసీల్దార్‌ కె.వెంకటరావు, బూత్‌ లెవెల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-04T23:51:36+05:30 IST