అత్తపై కత్తితో అల్లుడు దాడి

ABN , First Publish Date - 2023-09-26T00:10:59+05:30 IST

అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన శ్రీకాకుళం నగరంలోని చిన్నబజార్‌లో సోమవారం చేటుకుంది.

అత్తపై కత్తితో అల్లుడు దాడి

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 25: అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన శ్రీకాకుళం నగరంలోని చిన్నబజార్‌లో సోమవారం చేటుకుంది. చిన్నబ జార్‌కు చెందిన వెలమల ఆదినారాయణకు, కరజాడకు చెందిన లింగం రామారావు, చిన్నమ్మడుల కుమార్తె సత్యవతికి 12 ఏళ్ల కిందట వివాహమైంది. ఆదినారాయణ, సత్యవతి నగరంలోని వేర్వేరు వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నారు. చిన్నమ్మడు భర్త రామారావు మరణించడంతో ఆమె తన అల్లుడు ఆదినారాయణ ఇంటిలోనే ఎనిమి దేళ్లుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం సత్యవతి, ఆదినారాయణ మధ్య చి న్నపాటి గొడవ జరగడంతో అత్త చిన్నమ్మడు కలుగజేసుకొని అల్లుడిని ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆదినారాయణ కత్తిపీటతో అత్త తలపై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. తలకు ఆరు కుట్లు పడ్డాయి. రిమ్స్‌ అవుట్‌పోస్టు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్‌ ఎస్‌ఐ బలివాడ గణేష్‌ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

మహిళపై దాడి.. కేసు నమోదు

సరుబుజ్జిలి, సెప్టెంబరు 25: మండలంలోని విజయరాంపురం గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు దవళ లక్ష్మిపై దాడి జరగడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. లక్ష్మి అన్నయ్య కుమారుడు మరో బాలుడు శనివారం గొడవపడ్డారు. దీంతో ఆదివారం సాయంత్రం బాడాన ఆదినారాయణ, మరికొంతమంది లక్ష్మి ఇంటి వద్దకు వెళ్లి గొడవచేశారు. ఆ సమయంలో లక్ష్మి గాయపడింది. దీంతో ఆమె శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందింది. ఈ మేరకు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-09-26T00:10:59+05:30 IST