Share News

సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2023-11-06T23:16:35+05:30 IST

సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంప్లా యీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఏంఏ రాజు, కార్యదర్శి ఏడీ కుమార్‌ మాట్లాడుతూ.. ఎంటీ డబ్ల్యూ యాక్ట్‌కు వ్యతిరేకంగా షెడ్యూల్‌ను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు.

సమస్యలు పరిష్కరించండి
డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఈయూ నాయకులు

పలాస: సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంప్లా యీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఏంఏ రాజు, కార్యదర్శి ఏడీ కుమార్‌ మాట్లాడుతూ.. ఎంటీ డబ్ల్యూ యాక్ట్‌కు వ్యతిరేకంగా షెడ్యూల్‌ను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. డిపోలో మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇచ్ఛాపురం వద్ద బాహుదా నదిపై వంతెన కూలిపోయినం దున మూడు కిలోమీటర్లు అదనంగా వెళ్లాల్సి వస్తోందని, ఆ రూటులో కిలోమీటర్లు సరి చేయాలని కోరారు. బస్సులకు సరైన పరికరాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా యని, తక్షణం తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘ కోశాధికారి పీఎల్‌ నారాయణ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:16:37+05:30 IST