అక్టోబరు 14, 15 తేదీల్లో ఎస్‌ఐ రాతపరీక్ష
ABN , First Publish Date - 2023-09-26T00:09:44+05:30 IST
ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు వచ్చే నెల 14, 15 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబ రు 25: ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు వచ్చే నెల 14, 15 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు విశాఖ రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 25 నుంచి ఈనెల 25వ తేదీ వరకు విశాఖలోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపికల్లో సేవలందించిన పోలీసు అధికారులకు, సిబ్బందిని డీఐజీ అభినందించారు.