ఉపాధి చూపించి గ్రానైట్‌ పరిశ్రమకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2023-06-03T00:16:18+05:30 IST

మా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి చూపించి గ్రానైట్‌ పరిశ్రమలకు అనుమతులివ్వాలని రాజపురం, దబ్బ గూడ గిరిజనులు సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఎదుట స్పష్టం చేశారు. దబ్బగూడ రెవెన్యూ కొండలో గ్రానైట్‌ పరిశ్రమకు వచ్చిన దరఖాస్తు మేరకు శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రాజపురం, నందలపాడు, దబ్బగూడ, జోడూరు గ్రామస్థులు కొండపై మొక్కలు నాటి ఉపాధి పొందుతున్నామని, గ్రానైట్‌ పరిశ్రమ వల్ల దీనిని నష్టపోతామన్నారు. పోడు భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

 ఉపాధి చూపించి గ్రానైట్‌ పరిశ్రమకు అనుమతివ్వండి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి

మెళియాపుటి, జూన్‌ 2: మా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి చూపించి గ్రానైట్‌ పరిశ్రమలకు అనుమతులివ్వాలని రాజపురం, దబ్బ గూడ గిరిజనులు సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఎదుట స్పష్టం చేశారు. దబ్బగూడ రెవెన్యూ కొండలో గ్రానైట్‌ పరిశ్రమకు వచ్చిన దరఖాస్తు మేరకు శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రాజపురం, నందలపాడు, దబ్బగూడ, జోడూరు గ్రామస్థులు కొండపై మొక్కలు నాటి ఉపాధి పొందుతున్నామని, గ్రానైట్‌ పరిశ్రమ వల్ల దీనిని నష్టపోతామన్నారు. పోడు భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. గ్రానైట్‌ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించాలని వారు కోరారు. గ్రామాల్లో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కొండల నీరు చెరువులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమ స్య లను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని సబ్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మైనింగ్‌ ఏడీ ఫణిభూషణ్‌, తహసీల్దార్‌ పి. సరోజిని, ఎస్‌ఐ టి.రాజేష్‌, సర్పంచ్‌ బి.సరోజిని తదితరులు పాల్గొన్నారు.

నిధులున్నా పనుల్లో జాప్యం ఏమిటి?

టెక్కలి: నిధులకు కొరత లేదు.. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తవడం లేదు.. కారణం ఏమిటని సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. తన కార్యాలయంలో శుక్రవారం ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సచివా లయాలు, రైతుభరోసా కేంద్రాలు, మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు.. ఇలా ఏ భవనం పనులు చూసినా నత్తనడకన సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున నిధులున్నా ఎందుకు ఆశించిన స్థాయిలో పను లు జరగడం లేదని ప్రశ్నించారు. సీసీ రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మా ణాలను త్వరితగతిన చేయించాలన్నారు. పనులకు సంబంధిత బిల్లుల అప్‌లోడ్‌ చేస్తే చెల్లింపులు ప్రక్రియ జరుగుతోందని, పనుల పూర్తికి తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ పనులు చేసేందుకు రూ.లక్షకు రూ.18 వేలు జీఎస్టీ చెల్లించాల్సి ఉన్నం దున కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, అందుకే పనుల్లో జాప్యం జరుగు తోందని ఇంజినీరింగ్‌ అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఈఈ వి.సురేష్‌కుమార్‌, డీఈఈ పి.ధర్మా రావు, ఏఈ ఎస్‌ఎల్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:16:18+05:30 IST