షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-03-02T23:50:30+05:30 IST
పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఏపీటీఎఫ్ నాయకులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం సరికాదని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని టెక్కలి మండల ఏపీటీఎఫ్ శాఖ గురువారం సాయంత్రం నిరసన తెలిపింది.
టెక్కలి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ఏపీటీఎఫ్ నాయకులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం సరికాదని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని టెక్కలి మండల ఏపీటీఎఫ్ శాఖ గురువారం సాయంత్రం నిరసన తెలిపింది. గతంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనాడూ ఈ తరహా పరిస్థితి లేదని వారు తెలిపారు. ధర్నా చేసిన వారిలో ఏపీటీఎఫ్ నాయకులు గున్న ప్రసాదరావు, ఎన్.సురేష్‌కుమార్, వజ్జ ఆదినారాయణ, కృష్ణారావు, నారాయణమూర్తి, వానయ్య తదితరులు పాల్గొన్నారు.