11 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2023-03-18T23:44:57+05:30 IST

స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా రూ.97లక్షలు లావాదేవీలకు సంబంధించిన 11 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి టి. హరిత తెలిపారు.

11 కేసుల పరిష్కారం
టెక్కలిలో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి హరిత

టెక్కలి రూరల్‌: స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా రూ.97లక్షలు లావాదేవీలకు సంబంధించిన 11 కేసులు రాజీ ద్వారా పరిష్కరించినట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి టి. హరిత తెలిపారు. కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి తేజా చక్రవర్తి, బెంచ్‌ సభ్యులు పాల్గొన్నారు.

రాజీ మార్గం ద్వారా..

కోటబొమ్మాళి/నరసన్నపేట: జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా సత్వరం కేసులు పరిష్కరించడం జరు గుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి సి.హరిప్రియ అన్నారు. శనివారం స్థానిక కోట బొమ్మాళి, నరసన్నపేట కోర్టుల్లో న్యాయ విజ్ఞాన సదస్సు, లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. నరసన్నపేట సబ్‌జైలును సంద ర్శించారు. కార్యక్రమంలో న్యాయవాదులు డి.నరసింహమూర్తి, బి. నారాయణరావు, కె.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:44:57+05:30 IST