Share News

వైసీపీని ఇంటికి పంపించండి

ABN , First Publish Date - 2023-11-19T23:55:25+05:30 IST

రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలో బాబు ష్యూరిటీ- భవి ష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పార్టీ అధినేత ప్రకటించిన మేనిఫెస్టోను వివరించి, కరపత్రాలు అందజేశారు. పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను నాయకులు వివరించారు.

వైసీపీని ఇంటికి పంపించండి
సారవకోట మండలంలోని అవలింగిలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్న కత్తిరి వెంకటరమణ :

రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలో బాబు ష్యూరిటీ- భవి ష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పార్టీ అధినేత ప్రకటించిన మేనిఫెస్టోను వివరించి, కరపత్రాలు అందజేశారు. పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలను నాయకులు వివరించారు.

కోటబొమ్మాళి:మండలంలోని పాకివలస, కొత్తపల్లి, హరిశ్చంద్రపురం, కొత్తపేట, ఎత్తురాళ్లపాడు పంచాయతీల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెం టీ కార్యక్రమాలను నిర్వహించారు.కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మక్క లక్ష్మణరావు, రాజమహంతి శ్రీనివాసరావు,రాంపాత్రుని బాబురావు, ధర్మాన నాగరాజు, చింతాడ సింహాచలం, బోర అప్పారావు, మస్తాన్‌, హనుమంతు అప్పలరాజు,అప్పన్న, సదునుపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫహిరమండలం:కుమ్మరి, మేదర కులస్థులకు చేయూత పథకం వర్తిం పజేయాలని జడ్పీటీసీ పి.బుచ్చిబాబు కోరారు.హిరమండలంలో బాబు ష్యూరి టీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్శహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కుమ్మరి, మేదర కులస్థులకు కులవృత్తి లేక జీవనం కష్టమవుతోం దన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాయకత్వంలో పార్టీ అధికా రంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.

ఫజలుమూరు(సారవకోట):వైసీపీ వైఫల్యాలే టీడీపీకి శ్రీరామరక్ష అనిటీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరివెంకటరమణ అన్నారు.అవలింగిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌చార్జి పొదిలాపు వేణుగోపాలరావు, నాయకులు పొన్నాన శంకరరావు, ఉమామహేశ్వరరావు, బోర ధనుంజయ, పి.కృష్ణారావు, ముద్దాడ లక్ష్మణ, మెండ మురళి, ఎస్‌.రామారావు, శిమ్మ రామకృష్ణ, పాల్గొన్నారు.

ఫపొందూరు: కింతలిలో బూబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్ర మాన్ని సర్పంచ్‌ పి.రామప్రసాద్‌, ఎంపీటీసీ కూటికుప్పల హనుమంతు రావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.

Updated Date - 2023-11-19T23:55:26+05:30 IST