రాష్ట్రస్థాయి ‘ఇన్‌స్పైర్‌’కు షూ గైడ్‌ ప్రాజెక్టు ఎంపిక

ABN , First Publish Date - 2023-03-19T23:52:55+05:30 IST

రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనకు బ్రాహ్మ ణతర్లా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సాల్మన్‌రాజు రూపొం దించిన షూగైడ్‌ ప్రాజెక్టు ఎంపికైందని సైన్స్‌ ఉపాధ్యాయుడు కొయ్యిల శ్రీనివాస రావు తెలిపారు.

రాష్ట్రస్థాయి ‘ఇన్‌స్పైర్‌’కు షూ గైడ్‌ ప్రాజెక్టు ఎంపిక

పలాసరూరల్‌: రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనకు బ్రాహ్మ ణతర్లా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సాల్మన్‌రాజు రూపొం దించిన షూగైడ్‌ ప్రాజెక్టు ఎంపికైందని సైన్స్‌ ఉపాధ్యాయుడు కొయ్యిల శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాస్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన 240 ప్రాజెక్టులు పోటీపడగా వాటిలో ఎంపికైన 24 ప్రాజెక్టుల్లో షూగైడ్‌ ప్రాజెక్టు ఒకటిగా నిలిచిందన్నారు. షూగైడ్‌ ప్రాజెక్టు ద్వారా దృష్టిలోపం ఉన్న వారికి మార్గ దర్శనం చేయడం, సైనికులు, పోలీసులు బాంబులను గుర్తిం చేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రస్థాయికి తమ విద్యార్థి ప్రదర్శన ఎంపిక కావడంపై హెచ్‌ఎం కె.వైకుంఠరావు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తంచేసి అభినందించారు.

Updated Date - 2023-03-19T23:52:55+05:30 IST