రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
ABN , First Publish Date - 2023-04-09T23:23:31+05:30 IST
దామోదరపురంలో ఆదివారం జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సనపల భీమారావు పర్యవేక్షణలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 32 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
టెక్కలి రూరల్: దామోదరపురంలో ఆదివారం జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సనపల భీమారావు పర్యవేక్షణలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 32 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో చంద్రమౌళి (శ్రీకాకుళం) ప్రథమ, కుప్పిలి సాయి (టెక్కలి ఐతం) ద్వితీయ, లోకేష్ (మందస) తృతీయ, అభినవ్ (బద్రి గ్రామం) నాల్గో స్థానాల్లో నిలిచారు. వీరు వచ్చే నెల 26 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ చదరంగం పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని భీమారావు తెలిపారు. విజేతలకు బహుమతులు అందించారు.