జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపిక
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:13 AM
పాముకాటు నుంచి రైతు మరణాలు తగ్గించాలని రూపొందించిన సైన్స్ ప్రాజెక్టు జాతీ య స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు చింతాడ హైస్కూల్ ఉపాధ్యా యుడు రూపొం దించిన ప్రాజెక్టు ఎంపికైంది.
శ్రీకాకుళం క్రైం: పాముకాటు నుంచి రైతు మరణాలు తగ్గించాలని రూపొందించిన సైన్స్ ప్రాజెక్టు జాతీ య స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు చింతాడ హైస్కూల్ ఉపాధ్యా యుడు రూపొం దించిన ప్రాజెక్టు ఎంపికైంది. ఈ నెల 23న జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో టీచర్స్ విభాగంలో చింతాడ మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు పి.గౌరీశ్వరరావు రూపొం దించిన లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫా ర్మర్స్ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎం పికైంది. శుక్రవారం కడపలో జరిగి న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో కూడా ఎంపికై, జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌కు నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుడు గౌరీశ్వరరావు కు ప్రశంసా పత్రం అందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పొలానికి వెళ్లే రైతులు పాములు, కీటకాలు, ప్రమాదకర జంతువుల నుంచి ఈ స్టిక్ రక్షణ కల్పిస్తుంది. ఈ స్టిక్ ఆన్‌చేయడం ద్వారా వచ్చే వైబ్రేషన్ వల్ల పాములు, కీటకాలు దూరంగా వెళ్లిపోతయి. ఈ స్టిక్‌లో లైట్ మెడికల్ టూల్ కిట్టు అమర్చి ఉంటుంది. రూ.200 ఖర్చుతోనే రైతుకు అన్ని విధాల ఈ స్టిక్ ఉపయోగపడుతుంది.