ప్రతిపక్షాలు అడ్డుకున్నా పథకాలు ఆగవు: మంత్రి
ABN , First Publish Date - 2023-06-24T23:30:25+05:30 IST
ప్రతిపక్షాలు అడ్డుకున్నా పథకాలు ఆగవని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పట్టణంలోని నాలుగో వార్డు పద్మనాభపురం కాలనీలో ‘గడపగడపకు మన ప్రభు త్వం’ నిర్వహించారు.
కాశీబుగ్గ: ప్రతిపక్షాలు అడ్డుకున్నా పథకాలు ఆగవని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పట్టణంలోని నాలుగో వార్డు పద్మనాభపురం కాలనీలో ‘గడపగడపకు మన ప్రభు త్వం’ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మునిసిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా రూ.100 కోట్లతో ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చే సేందుకు పనులు జరుగుతున్నాయని, త్వరలో పూర్తిచేసి తాగునీరందిస్తామన్నారు. చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్లు బోర కృష్ణారావు, ఎం.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు
నరసన్నపేట: అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకా లను కొనసాగిస్తామని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం కామేశ్వరిపేట గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న సురక్ష ద్వారా అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలను అంద జేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.