దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ తీర్మానం దారుణం
ABN , First Publish Date - 2023-03-27T23:40:12+05:30 IST
అసెంబ్లీలో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం దారుణమని, దీనిని విశ్వహిందూ పరి షత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర శేఖర్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక సబ్ కలెక ్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఓట్ల రాజకీయాలకు ప్రజలతో ఆడుకో రాదని, ఈ తీర్మానం వల్ల మత మార్పిడులను ప్రోత్సహించినట్లవుతుం దన్నారు.
టెక్కలి: అసెంబ్లీలో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం దారుణమని, దీనిని విశ్వహిందూ పరి షత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర శేఖర్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక సబ్ కలెక ్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఓట్ల రాజకీయాలకు ప్రజలతో ఆడుకో రాదని, ఈ తీర్మానం వల్ల మత మార్పిడులను ప్రోత్సహించినట్లవుతుం దన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బొడ్డ అయ్యబాబు, గేదెల చంద్ర శేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే ఇదే అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో ధూపాన రాజకుమార్‌రెడ్డి, బి.నరేంద్ర, బి.కామేశ్వరరావు, రామ్‌జీ తదితరులు కూడా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
దళితుల హక్కులను కాలరాస్తూ తీర్మానించడం తగదు
కొత్తూరు: దళితుల హక్కులను కాలరాస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీర్మానించడం తగదని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు అన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ బాలకు సోమవారం వినతి పత్రం అందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తే వీహెచ్‌పీ మరో ఉద్యమానికి తెరతీస్తుందన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వీహెచ్‌పీ జిల్లా సహాయ కార్యదర్శి గేదెల మన్మథరావు, జంక వెంకట రావు, కలమట శ్రీరాములు, వడమ జవరాజు తదితరులున్నారు.
తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
పలాసరూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీ రిజర్వేషన్ నిమిత్తం చేసిన తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవా లని వీహెచ్‌పీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఓట్ల రాజకీయాల కోసం ప్రజలతో ఆడుకోవద్దని, ఇటు వంటి తీర్మానాల వల్ల మత మార్పిడులను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌సీ సభ్యులు చల్ల చంద్రమౌళి, ఎ.మురళీకృష్ణ, కె.శ్రీనివాస్, రాజాశ్రీకాంత్, శంకర్ పాల్గొన్నారు.