వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ
ABN , First Publish Date - 2023-09-04T00:04:20+05:30 IST
ఎర్రగాంలో వంశధారనదిలో ఆమదాలవలస, ఎర్రగాం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు.
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
సరుబుజ్జిలి, సెప్టెంబరు 3: ఎర్రగాంలో వంశధారనదిలో ఆమదాలవలస, ఎర్రగాం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని ఎర్రగాంలో టీడీపీ నాయకుడు గురువు తిరుమలరావు ఆధ్వర్యంలో మహిళా మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ఇసుక ర్యాంపుపై ఉన్న శ్రద్ధ ఎర్రగాం అభివృద్ధిలో లేదని ఆరోపించారు. రాత్రివేళల్లో వందలాది లారీల్లో ఇ సుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. అనం తరం టీడీపీ నాయకులు రవికుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, నందివాడ గోవిందరావు, తమ్మినేని గీత, పల్లి సురేష్, సింహాచలం, కె. సూర్యనారాయణ పాల్గొన్నారు.