ఆలయాల్లో సంప్రోక్షణ
ABN , First Publish Date - 2023-10-30T01:08:02+05:30 IST
చంద్ర గ్రహణం నేపథ్యంలో శనివారం సాయం త్రం మూతబడిన ఆలయాలు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తుల దర్శనం కోసం తెరిచారు.
జలుమూరు/ టెక్కలి రూరల్/పాతపట్నం/ నందిగాం: చంద్ర గ్రహణం నేపథ్యంలో శనివారం సాయం త్రం మూతబడిన ఆలయాలు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తుల దర్శనం కోసం తెరిచారు. జలు మూరు మండలం శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వర స్వామి, రావివలస ఎండల మల్లి కార్జున స్వామి, టెక్కలిలోని లక్ష్మీ నరసింహ స్వామి, పాతపట్నంలోని నీలమణి దుర్గ, నీలకం ఠేశ్వర, వేంకటేశ్వర, నందిగాం మండలంలోని పలు ఆలయా ల్లో సంప్రోక్షణ చేసి పూజలు చేశారు. అనంతరం దర్శనాలకు అనుమతిచ్చారు.