వేతన బకాయిలు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2023-04-03T23:36:54+05:30 IST

విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మాకు గత రెండు నెలలుగా వేతనాలు ఇవ్వ లేదని, తక్షణం బకాయిలు విడుదల చేయాలని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంఈవో కె.రాంబాబుకు వినతి పత్రం అందించారు. మధ్యా హ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

వేతన బకాయిలు విడుదల చేయాలి
ఎంఈవో రాంబాబుకు విపతిపత్రం అందజేస్తున్న ఎమ్మార్సీ సిబ్బంది

హిరమండలం: విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మాకు గత రెండు నెలలుగా వేతనాలు ఇవ్వ లేదని, తక్షణం బకాయిలు విడుదల చేయాలని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఎంఈవో కె.రాంబాబుకు వినతి పత్రం అందించారు. మధ్యా హ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఐదేళ్లుగా వేతనం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెంచలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రోజురోజుకు పని భారం పెరుగుతున్నప్పటికీ వేతనం చాలకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారు తోందని వాపోయారు. ప్రతినెలా ఒకటో తేదీ నాటికి వేతనాలు చెల్లించాలని, ఎంటీ ఎస్‌ అమ లు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది టి.ధనుంజయరావు, కె.సంతో ష్‌, ఎల్‌.బాబూరావు, జి.పద్మ, పి.శ్రీదేవి, లక్ష్మి, కె.చంద్రరావు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:36:54+05:30 IST