సిక్కోలులో సాయిధరమ్‌ తేజ్‌

ABN , First Publish Date - 2023-07-21T23:55:11+05:30 IST

సినీ హీరో సాయిధరమ్‌తేజ్‌ శుక్రవారం శ్రీకాకుళంలో సందడి చేశారు. ప్రత్యక్షదైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

సిక్కోలులో సాయిధరమ్‌ తేజ్‌
ఆదిత్యుడి సన్నిధిలో సాయిధరమ్‌ తేజ్‌

- ఆదిత్యుడి సన్నిధిలో పూజలు

అరసవల్లి, జూలై 21: సినీ హీరో సాయిధరమ్‌తేజ్‌ శుక్రవారం శ్రీకాకుళంలో సందడి చేశారు. ప్రత్యక్షదైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి జ్ఞాపికను ఈవో హరిసూర్యప్రకాష్‌ అందజేశారు. అనంతరం సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. 2014లో అరసవల్లి వచ్చానని, మళ్లీ ఆదిత్యుడ్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

అభిమానుల కోలాహలం

హీరో సాయిధరమ్‌ తేజ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం ముఖద్వారం వద్ద గజమాలతో సత్కరించారు. అనంతరం అరసవల్లి ఆదిత్యుడి ఆలయం వరకు తీన్‌మార్‌ డప్పులు, డీజే సౌండ్‌లతో యువత బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అభిమానుల కేరింతలతో కోలాహలంగా ర్యాలీ సాగింది. ఆదిత్యుడి దర్శనం అనంతరం స్థానిక 80 అడుగుల రోడ్డులోని ఫంక్షన్‌ హాల్‌లో అభిమానులతో సాయిధరమ్‌ తేజ్‌ సమావేశమయ్యారు. తమపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తన మేనమామ పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించిన బ్రో సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు. సినిమాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యుడు మండవిల్లి రవి, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు తైక్వాండో శ్రీను, అభిమాన సంఘం నాయకులు జోగిపాటి వంశీ, గొర్లె కిరణ్‌కుమార్‌, వైశ్యరాజు మోహన్‌, సంతోష్‌, లింగాల హరీష్‌, నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:55:11+05:30 IST