అరుణాచల గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ సర్వీసులు

ABN , First Publish Date - 2023-06-03T00:31:23+05:30 IST

అరుణాచల గిరి ప్రదక్షిణకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

అరుణాచల గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ సర్వీసులు
జెండా ఊపి సర్వీస్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం

అరసవల్లి: అరుణాచల గిరి ప్రదక్షిణకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం బయలుదేరిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు విహారయాత్ర ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. రెండో రోజు కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం, అనంతరం శ్రీపురంలో గోల్డెన్‌ టెంపుల్‌, అక్కడ నుంచి అరుణాచలం గిరిప్రదక్షిణకు చేరుకునేలా సర్వీసు ఉంటుందని వివరించారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి క్షేత్రం చూసుకుని శ్రీకాకుళం బస్సు చేరుకుంటుందని స్పష్టం చేశారు. నాలుగు రోజుల బస్సులో యాత్రకుగాను ఒకరికి రూ.4500 టిక్కెట్‌ వసూలు చేసినట్టు చెప్పారు. జూలై 30వరకు ఈ సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2023-06-03T00:31:23+05:30 IST