ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌

ABN , First Publish Date - 2023-10-06T23:36:24+05:30 IST

టెక్కలి నుంచి శ్రీకాకుళం వెళుతున్న ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిలై అదుపు తప్పిన ఘటన పల్లిపేట జంక్షన్‌ సమీపంలోని శివా లయం వద్ద శుక్రవారం సంభవించింది.

ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌
ఘటనా స్థలంలో ఆర్టీసీ బస్సు.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న పోలీసులు

నరసన్నపేట, అక్టోబరు 6: టెక్కలి నుంచి శ్రీకాకుళం వెళుతున్న ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిలై అదుపు తప్పిన ఘటన పల్లిపేట జంక్షన్‌ సమీపంలోని శివా లయం వద్ద శుక్రవారం సంభవించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. టెక్కలిలో మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు సంతబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వస్తున్న బస్సు నరసన్నపేట పట్టణం లోకి వచ్చే సరికి ఒక్కసారి బ్రేక్‌ ఫెయిలైంది. వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.. దీంతో ముందుగా వెళుతున్న కారుకు ఢీకొంది. కారు నుజ్జయింది. ఈ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారి కారుకు ఢీకొనడంతో వారంతా భయపడి కేకలు పెట్టడంతో రోడ్డుపై వెళుతున్న వారు పక్కకు తప్పుకున్నారు. పల్లిపేట జంక్షన్‌ వచ్చేసరికి బస్సు ఆగింది. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుపోవడంతో ప్రయాణి కులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన ప్రాంతానికి ఎస్‌ఐ సింహాచలం చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాలం చెల్లిన బస్సులను నడపడంపై ప్రయాణికులనుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై శాఖాపరంగా దర్యాప్తు చేపట్టనున్నట్లు టెక్కలి ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు.

Updated Date - 2023-10-06T23:36:24+05:30 IST