Share News

రూ.12 కోట్లన్నారు.. ఏమయ్యాయి?

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:14 AM

జిల్లాకేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణానికి సీఎం జగన్‌ రూ.12 కోట్లు మంజూరు చేశారని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు ఆ నిధులు ఏమయ్యాయని టీడీపీ యువ నాయకుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సం ఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ ప్రశ్నించారు.

రూ.12 కోట్లన్నారు.. ఏమయ్యాయి?
స్టేడియం వద్ద నినాదాలు చేస్తున్న గొండు శంకర్‌ తదితరులు

- కోడి రామ్మూర్తి స్టేడియం పనులు పూర్తి చేయాలి

- ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్‌

అరసవల్లి: జిల్లాకేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణానికి సీఎం జగన్‌ రూ.12 కోట్లు మంజూరు చేశారని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు ఆ నిధులు ఏమయ్యాయని టీడీపీ యువ నాయకుడు, ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సం ఘం అధ్యక్షుడు గొండు శంకర్‌ ప్రశ్నించారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను అం దించిన ఈ స్టేడియాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు. శుక్రవారం ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి స్టేడియం వద్ద ర్యాలీ నిర్వహించి వి లేకరులతో మాట్లాడారు. స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.12కోట్లు నిధులు మంజూరు చేసినట్టు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు డ్రామాలాడారన్నారు. నిధు లు మంజూరైన తర్వాత ఒక్క పనికూడా చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమ న్నారు. వందలాది హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. వాటి అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. జగన్‌ ఫొటోకు పాలాభిషేకం చేసి స్టే డియం నిర్మాణం పూర్తియిపోతుందంటూ హడావుడి చేశారని, మరి స్టేడియం పరి స్థితి ఏమిటో ధర్మాన సోదరులు చెప్పాలని నిలదీశారు. ఆడుదాం ఆంధ్ర అంటూ యువతను మరోసారి మోసం చేసే ప్రక్రియకు వైసీపీ తెరలేపిందన్నారు. ఇంకా మాయమాటలతో ప్రజలను ఎన్నాళ్లు మోసం చేయగలరన్నారు. వచ్చే సార్వత్రిక ఎ న్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తక్షణమే స్టేడి యం నిర్మాణ పనులను ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అంబటి లక్ష్మీరాజ్యం, టీన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు రెడ్డి శంకర్‌, పార్టీ నాయకులు ఇప్పిలి తిరుమల, బొల్ల నాగేంద్ర యాద వ్‌, చింతనిప్పుల రాజేంద్ర, బాషా షరీఫ్‌, గొండు రమణమూర్తి, రుప్ప రమణమూ ర్తి, కొయ్యాన జగదీష్‌, శిమ్మ శ్రీను, ఎండు చిన్నారావు, ఎండు అమ్మన్నరావు, రావుల గాంధీ, రెడ్డి సూర్యనారాయణ, కొర్ను సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:14 AM