ఆర్టీసీ ప్రయాణికులకు బహుమతులు
ABN , First Publish Date - 2023-12-04T00:18:48+05:30 IST
శ్రీకాకుళం-1, 2 డిపోల నుంచి వివిధ మార్గాల్లో నడుపుతున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేసి గిఫ్ట్ స్కీంలో ఎంపికైనవారికి ఆదివారం శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ శర్మ బహుమతులను అందజేశారు.
గుజరాతీపేట: శ్రీకాకుళం-1, 2 డిపోల నుంచి వివిధ మార్గాల్లో నడుపుతున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేసి గిఫ్ట్ స్కీంలో ఎంపికైనవారికి ఆదివారం శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ శర్మ బహుమతులను అందజేశారు. నవం బరు 16 నుంచి 30వ తేదీ వరకు రెండు డిపోలకి చెందిన బస్సుల్లో ఆమదావలస, చీపురుపల్లి, బందరువానిపేట, సాలూరు, విజయనగరం, జీకేవలస, యరగాం, శ్రీముఖలింగం రూట్లలో ప్రయాణం చేసిన వారికి డ్రా తీశారు. ఇందులో సాలూరు మార్గంలో శ్రీనివాసరావు, రామకృష్ణ, తరంగిణిలకు, చీపురుపల్లి మార్గంలో చందు, చిన్నా, సుష్మితలకు, బందువానిపేట మార్గంలో సాయికిరణ్, హృదయ నందన్, తేజే శ్వరిలకు, ఆమదాలవలస మార్గంలో హర్ష, సూర్యకుమారి, జగదీష్‌లకు, విజయ నగరం మార్గంలో హేమలతకు, జీకే వలస మార్గంలో గంగమ్మకు, శ్రీముఖలింగం మార్గంలో సాయికృష్ణ, మురళీకృష్ణ అనే ప్రయాణికులు ఎంపికయ్యారు. విజేతలకు బోయిన పృధ్వీ, ఊన్న కిరణ్‌కుమార్, జీఎన్‌వీ జ్యూయలర్స్ సౌజన్యంతో బహుమ తులు అందజేశారు. కార్యక్రమంలో వన్ డిపో మేనేజరు మల్లికార్జునరాజు, సహాయ మేనేజర్లు రమేష్, శంకర్, ట్రిఫిక్ ఇన్స్‌పెక్టర్ నాయుడు, స్టేషన్ మేనేజర్ ఎంపీ రావు, ఎస్డీఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.