మెగా జాబ్‌మేళాకు స్పందన

ABN , First Publish Date - 2023-06-03T00:29:22+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువ తకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వార్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు.

మెగా జాబ్‌మేళాకు స్పందన
మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్‌

శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువ తకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వార్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు 15 ప్రైవే ట్‌ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించా రు. 533 మంది హాజరు కాగా 209 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ డీవీ విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగపర్చు కోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇంటర్వ్యూకు హజరై ఎంపికవ్వని అభ్యర్థులు స్కిల్‌ హబ్స్‌ ట్రైనింగ్‌లో చేరి నైపుణ్యాలను పెంచుకుని, మళ్లీ జాబ్‌మేళలో పాల్గొని విజయం సాధించాలన్నారు. కార్యక్ర మానికి జిల్లా ఉపాధి అధికారి సుధ, అర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేఖవాణి, సెట్‌శ్రీ సీఈవో ప్రసాదరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు, ఎస్‌ఈబీ సీఐ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:29:22+05:30 IST