వక్ఫ్‌ స్థలాల్లో ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2023-06-26T23:28:19+05:30 IST

ఇచ్ఛాపురంలో ఏపీ స్టేట్‌ వక్ఫ్‌ బోర్డ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ షీరిన్‌ బేగమ్‌ (ఐపీఎస్‌) ఆదేశాల మేరకు వక్ఫ్‌ బోర్డ్‌ స్థలాల్లో ఆక్రమణలను బోర్డు అధికారులు సోమవారం తొలగిం చారు.

వక్ఫ్‌ స్థలాల్లో ఆక్రమణల తొలగింపు
షాపులు తొలగిస్తున్న దృశ్యం

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో ఏపీ స్టేట్‌ వక్ఫ్‌ బోర్డ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ షీరిన్‌ బేగమ్‌ (ఐపీఎస్‌) ఆదేశాల మేరకు వక్ఫ్‌ బోర్డ్‌ స్థలాల్లో ఆక్రమణలను బోర్డు అధికారులు సోమవారం తొలగిం చారు. పట్టణంలోని హాస్పిటల్‌ రోడ్డులో గల పీర్లపంజా స్థలంలో అనుమతిలేకుండా ఆక్రమించుకొని షాపులు ఏర్పాటు చేసి కొందరు వ్యాపారాలుచేస్తు న్నారు. షాపులను నిర్వహిస్తున్న వారికి ఇటీవలే మూడు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. సోమవారం షాపులు ఖాళీ చేయించి స్థలంలో ఉన్న మొత్తం షాపులను యంత్రాలతో తొలగించారు. షాపులు తొలగించే సమయంలో ఎటువంటి సమస్య లు తలెత్తకుండా పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏపీఎస్‌బీ ఎస్‌టీఎఫ్‌ఓ జానబ్‌ మోసబిన్‌ ఇబ్రహీం, ఈవోలు జానబ్‌ అబ్దుల్‌ కుదాస్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్లు అబ్దుల్‌ సాదిక్‌ షేక్‌, అహ్మద్‌ మోహినుద్దీన్‌, బోర్డ్‌ అసిస్టెంట్లు ఎండీ రయాజ్‌ఖాన్‌, షేక్‌ అలీషా పాల్గొన్నారు. ల

Updated Date - 2023-06-26T23:28:19+05:30 IST