మత విశ్వాసాలను గౌరవించాలి
ABN , First Publish Date - 2023-06-11T00:00:42+05:30 IST
మతవిశ్వాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని టీడీపీ జిల్లా అద్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. లోలుగు గ్రామంలో శనివారం నిర్వహించిన శివాలయ ప్రారంభోత్సవం, షిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
పొందూరు: మతవిశ్వాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని టీడీపీ జిల్లా అద్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. లోలుగు గ్రామంలో శనివారం నిర్వహించిన శివాలయ ప్రారంభోత్సవం, షిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మత విశ్వాసాలు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని, ఓట్లకోసం, స్వార్థ రాజకీయం కోసం అన్నిమతాల వారిని వైసీపీ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రామ్మో హన్, వండాన మురళి, బలగ శంకరభాస్కర్, బాడాన గిరి, లోలుగు వెంకట్ తదితరులు ఉన్నారు.