బీఆర్‌ఏయూలో సెమిస్టర్‌ ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2023-06-26T22:36:13+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌, వర్సిటీ, అనుబంధ కళాశాలల న్యాయ, వ్యాయామ విద్యకు సంబంధించి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు.

బీఆర్‌ఏయూలో సెమిస్టర్‌ ఫలితాల విడుదల

ఎచ్చెర్ల, జూన్‌ 26: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌, వర్సిటీ, అనుబంధ కళాశాలల న్యాయ, వ్యాయామ విద్యకు సంబంధించి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ కోర్సులో సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌ బ్రాంచ్‌ల్లో ఐదో సెమిస్టర్‌కు 199 మంది పరీక్షలకు హాజరుకాగా 154 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏడో సెమిస్టర్‌ 189కు 163 మంది పాసయ్యారు. న్యాయశాస్త్రం 3వ సెమిస్టర్‌లో మూడేళ్ల కోర్సుకు 106కు 102 మంది, ఐదేళ్ల కోర్సులో 23కు 22 మంది, 7వ సెమిస్టర్‌లో ఐదేళ్ల కోర్సులో 14కు 13 మంది ఉత్తీర్ణులయ్యారు. బీపీఈడీ కోర్సులో 3వ సెమిస్టర్‌లో 114కు 109 మంది, ఇదే సెమిస్టర్‌లోనే డీఈపీడీలో ఏడుగురు హాజరుకాగా శతశాతం ఫలితాలు సాధించారు. ఫలితాల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పరీక్షల విభాగం డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌ తెలిపారు.

Updated Date - 2023-06-26T22:36:13+05:30 IST