బకాయిలను తక్షణం విడుదల చేయండి
ABN , First Publish Date - 2023-03-05T23:25:57+05:30 IST
ప్రభుత్వం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయి లను తక్షణం విడుదల చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చింతాడ దిలీప్ డిమాండ్ చేశారు. ఆదివారం పిన్నింటిపేట పాఽఠశాల ప్రాంగణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు.
పిన్నింటిపేట(పోలాకి): ప్రభుత్వం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయి లను తక్షణం విడుదల చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు చింతాడ దిలీప్ డిమాండ్ చేశారు. ఆదివారం పిన్నింటిపేట పాఽఠశాల ప్రాంగణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యో గులకు పీఎఫ్, సరెండర్ లీవు, మూడు విడతల డీఏ బకాయిలు, ఏపీజీఎల్‌ఐసీ వంటి పథ కాల ద్వారా నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ స్పందిం చడం లేదన్నారు. ఉద్యో గుల ఓట్లతో గెలిపిన సీఎం జగన్ ఇప్పుబు వారిని చిన్నచూపు చూస్తున్నా రని ఆరోపించారు. పాఠశాలల విలీనం పేరుతో ఉపాధ్యాయులకు ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తుండడం దారుణమన్నారు. పదోతరగతి పరీక్షల సమయంలో సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను బది లీలు తగదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.