టీడీపీవైపే రెడ్డిక కులస్థులు
ABN , First Publish Date - 2023-08-30T00:38:24+05:30 IST
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల నాలుగు మండలాల్లో గల రెడ్డిక కులస్థులు ఎక్కువ శాతం టీడీపీ వైపు ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిత సమితి కన్వీనర్ కొండా శంకర్‌రెడ్డి అన్నారు.
ఇచ్ఛాపురం, ఆగస్టు 29: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గల నాలుగు మండలాల్లో గల రెడ్డిక కులస్థులు ఎక్కువ శాతం టీడీపీ వైపు ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర బీసీ సాధికారిత సమితి కన్వీనర్ కొండా శంకర్‌రెడ్డి అన్నారు. టీడీపీ పార్టీకి మద్దతుగా మంగళవారం రెడ్డిక కులస్థులు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్, ఎర్రన్నాయుడి విగ్రహాలకు పూలమాలలు వేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రెడ్డిక కుల స్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు అండగా రెడ్డిక కులస్ధులు ఉన్నారన్నారు. మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సాడి సహదేవ్‌రెడ్డి, నాయకులు మణిచంద్ర ప్రకాష్, లీలారాణి, నందికి జాని, మేరుగు సూర్యనారాయణ రెడ్డి, బాజ్జీ, పిలక చిన్న, దక్కత రామారావు, తదితరులు పాల్గొన్నారు.